Sites like

karlapalem-hanumantha-rao.blogspot.com
Alternatives

  karlapalem-hanumantha-rao.blogspot.com

నాకు తెలిసిన లోకం

 మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్,  08-09-2010  మతభావనలు, మనిషికీ నరవానరానికి తేడాలు తలెత్తినప్పటినుంచీ మొదలైనవిగానేభావించవచ్చు. ప్రాథమికస్థాయిలో, సముదాయాలుగా గుహల్లో తలదాచుకుని, వేటాడుతూబతికిన ఆదిమానవులకు ఆహారసేకరణ అన్నిటికన్నా ముఖ్యమైన వ్యాపకంగా ఉండేది. ఏదైనా జంతువును మాటువేసి చంపగలిగినప్పుడు వారికి ఆ జంతువుపట్ల కృతజ్ఞతాభావంకలిగేదేమో. తమ కడుపులు నింపి, తమ ప్రాణాలు కాపాడిన ఆ ప్రాణి తమను భవిష్యత్తులోకూడా 'కరుణించాలని' వారు కోరుకోవడంలో ఆశ్చర్యంలేదు. ప్రాంతాన్నీ, తెగనీబట్టి ఒక్కొక్కజంతువు ఆదిమానవులకు పూజనీయంగా తయారయింది. ఇప్పటికీ పాతపద్ధతులనువిడనాడని చాలా ఆటవికతెగలకు చిహ్నాలుగా టోటెమ్ జంతువులు కనిపిస్తాయి. వారువాటిని ఆరాధిస్తారు. తమ తెగకు వాటిని గుర్తుగా భావిస్తారు. తరవాతి దశల్లో ఇటువంటివాటి విగ్రహాలను తయారుచేసి పూజించడం కూడామొదలయింది. ముఖ్యంగా పశ్చిమాసియాలో ఇలా ఒక్కొ తెగకి ఒక్కొక్క జంతువు ప్రతినిధికావడం, ఈ తెగలమధ్య పోటీలు పెరిగి కొట్లాటలు జరగడం ఆరంభమయింది. ప్రాచీనమతాలలో ఒకటైన యూదుమతంలోనూ, ఆ తరువాత వచ్చిన ఇస్లాంలోనూ ఈవిగ్రహారాధనను గర్తించే పరిస్థితులు ఏర్పడ్డాయి. పది దైవశాసనాలను తీసుకొచ్చిన మోసిస్అయినా, మహమ్మద్ ప్రవక్త అయినా భగవంతుడసేవాడికి రూపం ఏదీ ఉండదనిచెప్పవలసివచ్చింది. ఎందుకంటే ఎటువంటి రూపాన్ని ఆమోదించినా కొందరికి సంతోషమూ, తక్కినవారికి ఆగ్రహమూ కలిగే ప్రమాదం ఏర్పడింది. నిత్యమూ చిహ్నాల పేరుతో కయ్యాలకుకాలుదువ్వే తెగలన్నిటినీ ఏకం చెయ్యడానికి 'నిరాకారుడైన' భగవంతుణ్ణి నిర్వచించడం తప్పమరో మార్గం లేకుండాపోయింది. మన దేశంలోనూ ఇటువంటి పరిస్థితులే ఉండేవి. కాని పురోహిత, అర్చక, ఋత్విజుల వర్గాలుఈ సమస్యను మరొక పద్ధతిలో పరిష్కరించినట్టుగా తెలుస్తోంది. ఉదాహరణకు శివుడినో, పశుపతి నాథుణ్ణి ఆరాధించేవారు సర్పాలను ఆరాధించేవారితో పోట్లాడకుండా ఉండడానికిపాములను శివుడి మెడలో వేశారు. అలాగే ఎద్దును శివుడికి వాహనం చేశారు. ఈ విధంగావిడిగా ఉన్న తెగలను ఏకం చేసే ప్రయత్నాలు ప్రాచీనకాలంలోనే విజయవంతంగా జరిగాయి. మరొకవంక ఆదిశక్తిని స్త్రీరూపంలో పూజించే సంప్రదాయం, శివుడితో వైరం పెట్టుకోకుండాఆమెను శివుడి భార్య అన్నారు. రానురాను ఈ కుటుంబం మరింత విస్తరించడంతోవినాయకుణ్ణి (ఏనుగును ఆరాధించే తెగ) వాళ్ళ కొడుకుగా పేర్కొన్నారు. దక్షిణాదిలోఎప్పటినుంచో ఆరాధిస్తున్న వేల్ మురుగన్ (కుమారస్వామిని) మరొక కుమారుడన్నారు. హిందూ సంప్రదాయంలో పాతనమ్మకాలను త్యజించడం అనేది ఎప్పుడూ, ఎక్కడా జరగదు. ప్రాచీన కాలపు నమ్మకాలన్నిటికీ ఏవో భాష్యాలూ, వివరణలద్వారా కొనసాగించడమేకనబడుతుంది. ఆర్యభాషీయులు క్రీ.పూ. 1400-1200 ప్రాంతాల సింధునది ప్రాంతాలకు వచ్చినప్పుడు వారుఆరాధించినది తమ ప్రాణాలు కాపాడే అగ్నినీ, ప్రకృతిదేవతలైన వరుణుడినీ, సూర్యుడినీ(మిత్రుడు) మాత్రమే. ఆ తరవాత వీరి ప్రాధాన్యత తగ్గింది. ఆర్యభాషీయులకుసమకాలికులుగా మన దేశానికి వచ్చి, ఏవో అభిప్రాయభేదాల కారణంగా తిరిగి వెళ్ళిపోయినఇండో ఇరానియన్ భాషీయులు ఋగ్వేద కాలానికి చెందిన పార్శీ మతగ్రంధం జెంద్ అవస్తారాసుకున్నారు. అందులో అసుర శబ్దానికి చాలా గౌరవం ఉండేది. సృష్టికర్తను ఆహురమ్మఅనేవారు. వారికి దైవ అనే శబ్దం పాపిష్టిది. మన దేశంలో స్థిరపడ్డవారు మాత్రం ఈ పదాలకువ్యతిరేకార్ధాలు ఆపాదించుకున్నారు. జెంద్ అవస్తాలో మహనీయుడుగా పేరు పొందినజొరాస్టర్ (జరతుష్ట) కశ్మీరుకు చెందినవాడనీ, అతన్నే మనవాళ్ళు వశిష్టుడంటారనీ కొందరిఅభిప్రాయం. ఆర్యభాషీయులు మన దేశంలో స్థిరపడ్డాక వారికి ఇంద్రుడు గొప్ప దేవత ఆయాడు. కానికొంతకాలానికి పటమీదా, ఏరుకుతినడంమీద మాత్రమే ఆధారపడిన ఆ ప్రజలు ముందుపశుపాలననూ, ఆ తరవాత వ్యవసాయాన్నీ వృత్తిగా స్వీకరించారు. ఆ దశలో ఇంద్రుడిప్రాభవం తగ్గి 'గోపాలుడైన' కృష్ణుడికి, 'హలధరుడైన' బలరాముడికి ఆదరణ పెరిగింది. అంతేకాక అడుగడుగునా ఇంద్రుడు కృష్ణుడి చేతిలో పరాభవం చెండడం చూస్తాం. ఇదంతాఅప్పటి సమాజంలో తలెత్తిన మార్పులకు ప్రతిబింబంలాగా అనిపిస్తుంది. క్రీ.పూ.2400 ప్రాంతాల మొదలైన సింధునాగరికత నాటి నుంచీ ఉన్న శివుడి ఆరాధన. మటుకుకొనసాగింది. అతిప్రాచీనదశలో హిందూదేవతలమధ్య తలెత్తిన విభేదాలు ఏనాడో సమసిపోయాయి. మళ్ళీ క్రీ.శ. ఎనిమిదో శతాబ్దం తరువాత వైదిక, అర్చకవర్గాలకు మాత్రమే పరిమితంగా ఉండినభగవదార్చనకు ప్రజాస్వామిక లక్షణాలు ఏర్పడ్డాయి. క్రైస్తవమతంలో ఆ తరవాత జరిగినపెనుమార్పులన్నీ మనదేశంలో ఎప్పుడో మొదలయ్యాయి. వీరశైవులుగానూ, వైష్ణవులుగానూబ్రాహ్మణేతరులు చాలామంది అధికసంఖ్యలో దేవతార్చనలు మొదలుపెట్టారు. కేవలంసంస్కృతి మంత్రాలేకాక హిందీ, తమిళం, కన్నడం, తెలుగువంటి స్థానికభాషల్లో భక్తిగీతాలూ, పాటల రచన జరిగింది. పురాణాలు అనువాదం జరిగింది. సమాజంలో అంతకంతకూ జరుగుతూ వచ్చిన మార్పులు మతిస్వభావాలను కూడా ప్రభావితం చేశాయి. ప్రస్తుత పరిస్థితి ఏమిటి? ఇప్పటికీ ఏ మతంలోనైనా ప్రార్ధన చేసే పద్ధతి ఆటవికదశనేతలపిస్తుంది. ఎక్కువగా దేవుడి పేరు తలుచుకోవడమే చూస్తాం. అది.. పిలుపే. ఎన్నో సార్లుపిలిస్తేగాని పట్టించుకోని సాటిమనిషిని పరిగణించినట్టి భక్తులు ప్రవర్తిస్తారు. సామాజికకారణాలవల్ల తలెత్తిన జీవిత సమస్యల పరిష్కారానికి ఆకాంపు' చూడడం మనుషులకుఅలవాటయింది. అలాంటి ప్రయత్నాలవల్ల ఫలితం ఉంటుందా అనే ప్రశ్నని పక్కనపెడితేదానివల్ల చాలామందికి మనశ్శాంతి కలుగుతుందనే విషయంలో సందేహమేమీ లేదు. పట్టణంలోని వ్యవస్థ సరిగా లేదని అధికారులకు విన్నవించుకున్న పద్ధతిలోనే భక్తులుప్రవర్తిస్తారు. అతని 'దయ' ఉంటే పరిస్థితులు చక్కబడతాయి. లేకపోతే లేదు. మనబాధ్యతల్లా చిన్నవించుకోవడమే! ఇదంతా మతభావనలను వెక్కిరించడానికి చేస్తున్న ప్రయత్నం కాదు. సంగతేమిటంటే తక్సినవిషయాల్లో చాలా తెలివిగా ప్రవర్తించేవారుకూడా మతం విషయంలో హేతువాదపైఖరినివిడనాడతారని మనం గమనించవచ్చు. అంతేకాక తాము స్వయంగా పరిష్కరించుకోగలఎటువంటి సమస్యకూ వారు 'దైవసహాయం' కోసం ఎదురుచూడరు. తెలియనివి, అస్పష్టంగాఅనిపించేవీ, చిక్కుముడ్తగా తమనను సవాలుచేసేవీ అయిన కష్టాలు ఎదురైనప్పుడే ఈ భక్తివెల్లడవుతుంది. మనిషికి అనాదిగానూ, అనుభవపూర్వకంగానూ అలవడిన కార్యకారణ సంబంధం మతంవిషయంలో బలంగా పనిచేస్తుంది. 'ఎవరో ఒకరు తిప్పకపోతే తారలచుట్టూ గ్రహాలూ, అణువులోని న్యూక్లియసచుట్టూ ఎలక్ట్రాన్లూ ఎలా తిరుగుతాయి? ఏదైనా 'తనంతటతానుగా' ఉనికిలోకి వస్తుందనే భావనను చాలామంది జీర్ణించుకోలేరు. ఏ భగవంతుడు ఏ వర్క్ షాప్లో కూర్చుని అన్నిటినీ సృష్టిస్తాడోఎవరికీ తెలియనప్పటికీ అలాంటిదేదో జరుగుతుందని జనం నమ్ముతారు. మనిషికన్నా శక్తివంతుడైన ఒక పాతకాలపు భగవంతుణ్ణి ఆమోదించలేని పాశ్చాత్యులు'ఇదిగో పులి అంటే అదిగో తోక' అన్న పద్ధతిలో గ్రహాంతర జీవుల గురించీ, ఫ్లయింగ్ సాసర్లగురించి వదంతులు లేవనెత్తుతారు. తమతమ సంస్కృతీసంప్రదాయాలనుబట్టి తమనుచుట్టుముట్టిన బాధలనుంచి విముక్తి ఎలా పొందాలో తెలియక జనం రకరకాలుగా భ్రమలకులోనవుతారు. మరణించిన తరవాత ఏమవుతుందో తెలియక అయోమయానికి లోనవడంమరొక ఇబ్బంది. తక్కిన కీటకాలూ, జంతువులూ, సాధారణ ప్రజలే కాకి కోట్లమందిజీవితాలను ప్రభావితం చేసిన 'యుగ పురుషులు' సైతం చనిపోయాక నామరూపాలులేకుండాపోతారని తెలిసినప్పటికీ 'మరణాంతర జీవితం' గురించిన ఆశలు మనుషులమనసుల్లో బలంగా పాతుకుని ఉంటాయి. మనకు కనబడే ప్రపంచం గురించి వాస్తవిక, భౌతికవాదదృక్పధం అలవరుచుకోవటానికిఎవరూ వేదాంతులు కానవసరంలేదు. మనం బడిలో చదువుకున్న విజ్ఞానాన్ని సరిగా అవగాహన చేసుకుంటే చాలు

noimage.png

Stats

  Alexa Rank: 


  Popular in Country: 


  Country Alexa Rank:  


 language:  en


  Response Time:  0.330995


  SSL:  Enable


  Status:  up


Code To Txt Ratio

 Word Count  1051


 Links  


  ratio  18.21403846405


SSL Details

SSL Issuer:

Issuer:  GTS CA 1C3


Valid From:  2022-06-06 08:59:22


Expiration Date:   2022-08-29 08:59:21


SSL Organization:

Signature 09ecf5a37f8210716bbf4aa859e8fcd17ca0d09f


Algorithm: RSA-SHA256


Found 7 Top Alternative to Karlapalem-hanumantha-rao.blogspot.com

2
vedikaa.com.png

Vedikaa.com

vedika | your forum for critical and constructive writings

your forum for critical and constructive writings

3
noimage.png

Saarangabooks.com

Saaranga Books - Home

All Things Unforgiven Tanhayi Aneka Yamakoopam Sufi Cheppina Katha Palaka Pencil The Disconnect Patterns

4
maalika.org.png

Maalika.org

మాలిక: తెలుగు బ్లాగుల సంకలిని మరియు తెలుగు బ్లాగర్ల వేదిక / Maalika - the quickest aggregator of Telugu blogs.

Maalika, the quickest aggregator of Telugu blogs. తెలుగు బ్లాగర్ల కోసం ఏర్పాటుచేసిన ఒక వేగవంతమైన తెలుగు బ్లాగుల సంకలిని

5
kathanilayam.com.png

Kathanilayam.com

కథానిలయం

ప్రసిద్ధ కథారచయిత కాళీపట్నం రామారావుగారి ఆలోచన రూపంగా 1997లో శ్రీకాకుళంలో కథానిలయం పుట్టింది. గురజాడ అప్పారావుగారి దిద్దుబాటు కథ వెలువడిన ఫిబ్రవరి 22వ తేదీన కథానిలయం ప్రారంభమయింది. రామారావుగారి సాహిత్య సంపాదనలో ప్రతి పైసా ఈ కథానిలయానికి అందించారు. అనేక మంది సాహిత్యాభిమానులు, రచయితలూ చేయివేసారు. రామారావుగారి సొంత పుస్తకాలు కథానిలయానికి తొలి పుస్తకాలు అయాయి. మొదటి సభలో పాల్గొన్న గూటాల కృష్ణమూర్తిగారు లండన్ నివాసి. చాలాకాలంగా బ్రిటిష్ లైబ్రరీతో...

6
gotelugu.com.png

Gotelugu.com

Gotelugu is a highly browsed Telugu weekly magazine | Gotelugu.com

Gotelugu is a highly browsed Telugu weekly magazine. Gotelugu provides Telugu stories, Telugu articles, serials, movie reviews, short films, cartoons, movie gossips, cinema updates, recipes and many more.

7
zaminryot.com.png

Zaminryot.com

Zaminryot

  Page No. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

Technologies Used by karlapalem-hanumantha-rao.blogspot.com

  • Blogger
  • Python
  • Java
  • OpenGSE
  • Google Font API
  • Dns Records of karlapalem-hanumantha-rao.blogspot.com

    A Record: 142.250.185.161
    AAAA Record: 2a00:1450:4001:803::2001
    CNAME Record: karlapalem-hanumantha-rao.blogspot.com
    NS Record:
    SOA Record:
    MX Record:
    SRV Record:
    TXT Record:
    DNSKEY Record:
    CAA Record:

    Whois Detail of karlapalem-hanumantha-rao.blogspot.com